చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌

Advertisements

<p>అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు&period; యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్‌ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది&period; ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది&period; ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని&comma; ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి సాధించామని చెబుతున్నారు ట్రంప్‌&period; బోయింగ్‌ సంస్థ నుంచి 200 విమానాలను కొనుగోలు చేయడానికి బీజింగ్‌ సమ్మతించిందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర చర్చల్లో పాల్గొనేందుకు బీజింగ్‌కు వెళ్లిన ట్రంప్‌&period;&period;పలుమార్లు ఆయనతో సమావేశమయ్యారు&period; ఇరాన్‌ యుద్ధం&comma; ద్వైపాక్షిక వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు&period; రెండ్రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో తిరిగి అమెరికాకు చేరుకున్నారు ట్రంప్‌&period; తన చైనా పర్యటన విజయవంతంగా ముగిసిందని వెల్లడించారు&period; మరోవైపు చైనా పర్యటన ముగింపు వేళ ఇరాన్ వ్యవహారంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి&period; ఇరాన్ విషయంలో తన సహనం నశిస్తోందని&comma; ఆ దేశం వెంటనే ఒక ఒప్పందానికి రావాలని కఠిన హెచ్చరికలు జారీ చేశారు&period; వ్యూహాత్మక జలసంధి &&num;8216&semi;స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్&&num;8217&semi;ను తిరిగి తెరవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం అంగీకరించారని ట్రంప్ స్పష్టం చేశారు&period; వాషింగ్టన్‌-టెహ్రాన్‌ మద్య ఒప్పందం కుదరాలని జిన్‌పింగ్‌ కూడా ఆకాంక్షిస్తున్నారన్న ట్రంప్‌&period;&period;ఇక ఇరాన్‌ పనైపోయిందని&period;&period;తమతో ఒప్పందం కుదుర్చుకోవడం&period;&period;లేదంటే విధ్వంసానికి గురవడం రెండు ఆప్షన్సే ఉన్నాయని వార్నింగ్‌ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..