అంతిమ విజయం అంగన్వాడీలదే…. ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదు

Alla Venkata Gopalakrishna

Advertisements

&NewLine;<p>గత 28 రోజుల నుంచి గన్నవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది&period; ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆపకపోతే ఎస్మా అమలు చేస్తామని జారీ చేసిన మేము చేస్తున్న సమ్మె మా డిమాండ్స్ నెరవేర వరకు ఆపేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు&period; అంగన్వాడీలు చేస్తున్న 28 రోజుల సమ్మెకు 28వ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య నీటిపారుదల శాఖ అధ్యక్షులు<br>ఆళ్ల వెంకట గోపాలకృష్ణ సంఘీభావం తెలియజేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మూర్ఖత్వ ప్రభుత్వము రాష్ట్రంలో అనేకమైన సమస్యలను పరిష్కరించలేక చేతులెత్తేసింది&period; అంగన్వాడి వర్కర్స్ గ్రామ గ్రామాలలో నిజాయితీగా సర్వీసులు చేస్తూ వారి జీవనోపాధికి వేతనం 26000 అడుగుతుంటే ఇవ్వలేమని బొత్స సత్యనారాయణ అంటున్నారు&period; స్కిల్డ్ లేబర్ కి రోజుకి 1000 రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అటెండర్ కి నెలకు లక్ష రూపాయలు వేతనం వస్తుంది&period; కేవలం వీరి జీవన ఉపాధికి 26000 వేతనం అడిగినందుకు వీరిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించటం అనేది చాలా దారుణమని అన్నారు&period; ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని&comma; అంతిమ విజయం అంగన్వాడీలదే ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు&period; గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4200 ఉన్న వేతనాన్ని 10500 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు&period; జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలలో కేవలం 1000 రూపాయలు మాత్రమే వేతనం పెంచాడని అన్నారు&period; అంగన్వాడీలు అడిగే గ్రాడ్యూటీ గాని రిటైర్మెంట్ బెనిఫిట్ గాని ఉద్యోగ భద్రత న్యాయపరమైనవి&comma; ఎంతోమంది పిల్లలకు అనేక సర్వీసులు చేసి వాళ్ళ జీవితాన్ని మొత్తం ఉద్యోగాలకే పరిమితం చేసి ఏ ఆధారం లేకుండా ఉండటం చాలా బాధాకరని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్