ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…

Advertisements

<p>పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది&period; ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది&period; ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లకు అమెరికా అంగీకారం తెలిపినట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడించాయి&period; లెబనాన్ సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి&comma; ఉద్రిక్తతలను తగ్గించడం&comma; అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా ఆంక్షల కారణంగా ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని అమెరికా ఎదుట ప్రతిపాదనలు పెట్టారు&period; అయితే&comma; ఈ రెండు కండీషన్లకు అమెరికా అంగీకరించడం పశ్చిమాసియాలో రాజకీయాల్లో ఒక భారీ మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు&period; కాగా&comma; ఇరాన్ ఆస్తుల విడుదల ద్వారా ఆ దేశానికి ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది&period; అదే సమయంలో లెబనాన్‌లో సీజ్‌ఫైర్ కుదరడం ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోవడానికి దోహదపడనుంది&period;ఓ వైపు అమెరికాతో దౌత్యం నడుపుతూనే&comma; ఇరాన్ తన పొరుగు దేశమైన పాకిస్థాన్‌ తో వ్యూహాత్మక చర్చలు జరుపుతోంది&period; శుక్రవారం అర్థరాత్రి అర్ధరాత్రి ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో సమావేశమైంది&period; ప్రాంతీయ భద్రత&comma; సరిహద్దుల్లో ఉగ్రవాద నియంత్రణపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం&period; అంతేకాదు&period;&period;అమెరికాతో జరగబోయే చర్చల నేపథ్యంలో పాక్ మధ్యవర్తిత్వం&comma; మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది&period;<br &sol;>&NewLine;ఖతార్‌తోపాటు కొన్ని విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించినట్లు తెలుస్తోంది&period; లెబనాన్‌లో కాల్పుల విరమణ&comma; స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తుల విడుదల అనే రెండు షరతులు అమలైతేనే చర్చలు జరుగుతాయని ఇరాన్‌ చెబుతోన్న విషయం తెలిసిందే&period; అయితే&comma; వీటిలో స్తంభింపజేసిన ఆస్తుల్లో ఎంత మొత్తం విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందనే విషయం తెలియరాలేదు&period; కేవలం ఖతార్‌లో స్తంభింపజేసిన 6 బిలియన్‌ డాలర్లను విడుదల చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం అంగీకరించినట్లు సమాచారం&period; దీనిపై అగ్రరాజ్యం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు&period;<br &sol;>&NewLine;విదేశాలకు చమురు విక్రయించడం ద్వారా ఇరాన్‌కు భారీగా డబ్బు సమకూరినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేకపోతోంది&period; ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇవన్నీ స్తంభించిపోయాయి&period; ఆయా దేశాల బ్యాంకు ఖాతాల్లోనే అనేక బిలియన్‌ డాలర్లు ఉండిపోయాయి&period; కేవలం ఖతార్‌ బ్యాంకుల్లోనే ఆరు బిలియన్లు ఉన్నట్లు అంచనా&period; అయితే&comma; వీటిని అమెరికా-ఇరాన్‌à°² మధ్య జరిగిన ఓ ఒప్పందంలో భాగంగా 2023లోనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ&period;&period; ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేయడంతో నాటి బైడెన్‌ యంత్రాంగం మళ్లీ స్తంభింపజేసింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.