మండల పరిధిలోని శాఖవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో పోకూరు శాకవరం రహదారిలో గడ్డం గోవిందమ్మ నివాస సమీపంలో గ్రామానికి చెందిన చుంచు శివకృష్ణ(34) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు పలు విధాలుగా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివకృష్ణ సోమవారం రాత్రి పోకూరు గ్రామానికి చేరుకొని 12 గంటల వరకు మద్యం సేవించి కాలినడకన గ్రామానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 12 గంటల సమయంలో రహదారిపై ఆయన పడిపోయి ఉండటం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా మృతదేహాన్ని చూసి నివాసానికి వెళ్ళినట్లు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు మృతదేహం వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. కందుకూరు సీఐ సుబ్బారావు లింగసముద్రం ఎస్సై బాజీ బాబు పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని తల్లి దండ్రులు సుబ్బారావు రవణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు అందజేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే స్థానికుల నుండి పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. శివకృష్ణకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఈ నేపథ్యంలోనే పొగ తోటలో హత్య చేసి రహదారిపై పడవేసి ఉంటారని అనుమానాలు ఉన్న ఎలాంటి వివరాలు లభించడం లేదు. మరోవైపు నోటి నుండి చూస్తుంటే ఇది మృతి హత్య లేక ప్రమాదం తోజరిగిందా పోస్టుమార్టం నివేదిక వస్తే తేటతెల్లమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అనుమానాస్పదంగా యువకుడు మృతి…
95
previous post