నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత

youth

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని యువత భావిస్తోంది&period; అందుకే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు&period; నిరుద్యోగ యాత్ర పేరుతో యువత రాష్ట్రమంతటా పర్యటించి తెలంగాణా రాక ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రజలకు వివరించనున్నారు&period; తెలంగాణా వచ్చిందే నీళ్లు&comma; నియామకాల కోసమని&comma; కానీ గులాబీ బాస్ ఆ రెండింటిని పూర్తిగా పక్కనపెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు&period; ఈ నేపథ్యలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిరుద్యోగులు బస్సు యాత్ర చేయాలని తలపెట్టారు&period; హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ప్రారంభమైన యాత్రను ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పది సంవత్సరాల్లో కెసిఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా చేయలేదని మండిపడ్డారు&period; మొక్కుబడిగా కొన్ని ఉద్యోగ నియామకాలు జరిపినా పేపర్ లీక్ కారణంగా విద్యార్థులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు&period; ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేది మహిళలు&comma; యువత కారణంగా అధికారంలోకి వస్తాయని చెప్పవచ్చు&period; కానీ కెసిఆర్ సర్కార్ యువత ఆశలను ఆడియాసలు చేయడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు&period; వీరందరూ మూకుమ్మడిగా గ్రామాల్లో పర్యటించి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభావం తప్పకుండా కెసిఆర్ పై పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..