74
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం పట్టపగలే గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు తన కుటుంబ అవసరాల నిమిత్తం బంగారంను బ్యాంకులో తాకట్టు పెట్టి 1,60,000 తీసుకొచ్చాడు. డబ్బును బైక్ లోని బ్యాగ్ లో ఉంచగా నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్ మీద వచ్చి బ్యాగ్ లో ఉంచిన నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీ చేస్తున్న దృశ్యాలను సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.