ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, నియోజకవర్గంలో దొంగలు హల్చల్(Thieves in Tiruvur). విసన్నపేటలో చోరీ చేసి పారిపోతుండగా గొల్లమందల గ్రామంలో గ్రామస్తులు పట్టుకున్న అనుమానితులు. ఒక ప్రయాణికురాలు నరసాపురం నుండి విస్సన్నపేట బస్సులో ప్రయాణం చేయుచుండగా ప్రయాణికురాలి బ్యాగ్ కొట్టేసిన ఇద్దరు మహిళలు. బ్యాక్ తో సహా ఆటోలో ఇద్దరు మహిళలు పారిపోతుండగా బ్యాగు కు సంబంధించిన వ్యక్తి గొల్లమందల్లో తన బంధువులు ఉండటంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఆటోలో వస్తున్న ఇద్దరు మహిళలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎ కొండూరు పోలీసు సిబ్బంది ఇద్దరు మహిళలను స్టేషన్ కు తరలించారు. స్థానిక దొంగల ? అంతర్రాష్ట్ర దొంగల? గుంపులుగా వచ్చారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి