రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించండి

Harish Rao

Advertisements

&NewLine;<p>తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు&period; సిద్దిపేట పట్టణంలోని అంబిటస్ స్కూల్ 114à°µ పోలింగ్ స్టేషన్లో మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొనున్నారు&period; పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి తన్నీరు హరీష్ రావు బీపీ చెక్ చేసుకున్నారు&period; ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చంద్దంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారన్నారు&period; గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు&period; పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగా ఉన్న గతంకంటే మెరుగ్గా ఉందన్నారు&period; ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించి&comma; ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; కొంత మంది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్దంగా పరిధి దాటి మాట్లాడుతున్నారని&comma; వారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు&period; నాగార్జున సాగర్ విషయంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాట్లాడుతా అన్నారు&period; రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ప్రభుత్వం&comma; కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..