పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించారని అప్పటి నుంచి ఆయన మరణించే వరకు కొనసాగారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని జగన్ మోడీకి లేఖ రాయడం ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
తిరుమలను దోపిడీ కేంద్రంగా మార్చారు
68
previous post