టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది&period; సీపీఐ&comma; సీపీఎం&comma; VCK పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి&period; దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్&comma; సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న టీవీకే అధినేత విజయ్‌&period;&period; చిన్న పార్టీలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు&period; ఈ క్రమంలోనే TVKకు మద్దతిచ్చేందుకు వామపక్షాలతో పాటు&comma; వీసీకే సమ్మతించినట్లు సమాచారం&period; దీంతో విజయ్‌ మరోసారి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు&period;<&sol;p>&NewLine;<p>ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది&period; విజయ్ రెండు చోట్ల గెలవడం వల్ల ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా టీవీకే బలం 107 మాత్రమే&period; ఈ నేపథ్యంలో&comma; ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది&period; ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 112కు చేరింది&period; తాజాగా వీసీకే రెండు&comma; సీపీఐ రెండు&comma; సీపీఎం రెండు పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఆ సంఖ్య 118కి చేరింది&period; చివరగా ఒక్క సీటు ఉన్న DMDK మద్దతు ఇవ్వడంతో విజయ్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య119కి పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.