పెద్దపల్లి జిల్లా రామగుండంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు, అనుమానస్పదంగా బైక్ లపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగ్ లలో 4.60 కేజీల గంజాయిని గుర్తించారు. దీని విలువ సుమారు 80,200 ఉంటుందని పొలీసులు తెలిపారు. నిందితులు కొన్ని రోజులుగా గంజాయికి బానిసై , తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో, ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని అమాయకపు విద్యార్థులకు, యువతకి ఎక్కువ ధరకు అమ్ముతన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Also..
Read Also..