ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియను సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని డిప్యూటీ డీ.ఈ.ఓ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్ ల శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీ.ఈ.ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీ.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు (సూక్ష్మ పరిశీలకులు) పోలింగ్ రోజు ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రారంభమయ్యే సమయాన్ని, పోలింగ్ ముగిసే సమయాన్ని గమనించాలని అన్నారు. ఈ.వీ.ఎం ల పనితీరు పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, గ్రీన్ పేపర్ సీల్, క్రమ సంఖ్యలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మాక్ పోల్ నిర్వహణను పరిశీలించాలని, పోలింగ్ స్టేషన్లకు దారులను పరిశీలించడం, సీక్రసీ ఓటింగ్, పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తన, ఫిర్యాదులను పరిశీలించాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పరిశీలనలో ఏ విధమైన సందేహాలు ఉన్నా వెంటనే జనరల్ అబ్జర్వర్ లకు తెలియజేయాలని అన్నారు.
మైక్రో అబ్జర్వర్ల కు శిక్షణ కార్యక్రమం
105
previous post