తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్..

Advertisements

<p>తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో&comma; స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం&period; తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది&period; 2025-26 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ రికార్డు స్థాయిలో లడ్డూలను విక్రయించి భారీ ఆదాయాన్ని ఆర్జించింది&period; 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో మొత్తం 13 కోట్ల 95 లక్షలా 43 వేల 231 లడ్డూలను భక్తులకు విక్రయించారు&period; అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 12 కోట్ల 18 లక్షాల 53 వేల 535గా ఉంది&period; అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే అదనంగా 1&period;76 కోట్ల లడ్డూల అమ్మకాలు పెరిగాయి&period; ఈ అమ్మకాల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో టీటీడీకి సుమారు రూ&period; 567 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది&period; ప్రస్తుతం భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రోజుకు సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది&period; శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు&period; అదనంగా లడ్డూలు కావాలనుకునే వారికి ఒక్కో లడ్డూను రూ&period; 50 చొప్పున విక్రయిస్తున్నారు&period; తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో లడ్డూ ప్రసాదం విక్రయాలు కూడా కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.