డీలిమిటేషన్ పై వైఖరి వెల్లడించిన టీవీకే అధినేత విజయ్..

Advertisements

<p>పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు&period; ఈ బిల్లు చట్టరూపం దాల్చితే జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు&period; పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ బిల్లు&comma; 2026ను కేంద్రం చర్చకు తీసుకురావచ్చని విజయ్ పేర్కొన్నారు&period; పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును స్వాగతిస్తున్నామని&comma; అయితే దానికంటే ముందు డీలిమిటేషన్ బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు&period; జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను పునర్విభజిస్తే&comma; జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో గణనీయంగా తగ్గిపోతుందన్నారు&period; దీనికి విరుద్ధంగా&comma; అధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరిగిపోతుందన్నారు విజయ్&period; ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని&&num;8230&semi;దీనివల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల గొంతు బలహీనపడి&comma; భాష&comma; సంస్కృతి&comma; రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాలపై తగినంత శ్రద్ధ లభించకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు&period;<br &sol;>&NewLine;తమిళనాడు ప్రజల ఆకాంక్షలు&comma; సమస్యలు పార్లమెంటులో సరిగ్గా వినిపించని దుస్థితి ఏర్పడుతుందని&comma; ఇది వివక్షాపూరిత చర్యేనని ఆయన అభివర్ణించారు&period; ఈ సవరణ కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికే కాకుండా&comma; కేంద్ర నిధుల కేటాయింపులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విజయ్ హెచ్చరించారు&period; ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి సరైన ప్రాజెక్టులు&comma; నిధులు కేటాయించడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు&period; ఇలాంటి పరిస్థితుల్లో జనాభా ఆధారంగా సీట్లను&comma; నిధులను పంపిణీ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు మరింత ఆర్థికంగా నష్టపోతాయని అన్నారు&period; కేంద్ర ప్రభుత్వ విధానాలను పాటించిన రాష్ట్రాలను శిక్షించి&comma; పాటించని రాష్ట్రాలకు బహుమతులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు&period; ఈ నేపథ్యంలో&comma; కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను పునఃపరిశీలించి&comma; ఈ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని విజయ్ డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక Aపై భారత్ A అద్భుత విజయం.

హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష.

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..