లోక్‌సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు..

Advertisements

<p>దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర చర్చ జరుగుతోంది&period; ఈ నేపథ్యంలో తమిళనాడులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి&period; డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళం విప్పారు&period; ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని ఆరోపిస్తూ&comma; ఆయన బహిరంగంగా బిల్లు ప్రతులను తగులబెట్టి సంచలనం సృష్టించారు&period; ఈ మంటలు కేవలం కాగితాలను కాల్చడం లేదని&comma; ఇవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అహంకారాన్ని అణచివేస్తాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణ రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు ఉందని ఆయన మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>ముఖ్యమంత్రి పిలుపుతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి&period; డీఎంకే శ్రేణులు ప్రధాన కూడళ్లు&comma; పార్టీ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి&period; దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని&comma; ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని డీఎంకే నేతలు స్పష్టం చేశారు&period; సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.