తంబళ్లపల్లెలో రాజకీయ పార్టీల్లో అనిచ్చితి..

Advertisements

<p>ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నాయి&period; రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు&comma; అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది&period; అయితే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది&period; బి కొత్తకోట&comma; పెద్దతిప్ప సముద్రం&comma; ములకలచెరువు&comma; తంబళ్లపల్లె&comma; కురబలకోట&comma; పెద్దమండ్యం మండలాల్లో ప్రజలు ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు&period; రోడ్లు సరిగా లేక రవాణా ఇబ్బందులు&comma; తాగునీటి కొరత&comma; ఆస్పత్రులలో సదుపాయాల లేమి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి&period; రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నా… తమ ప్రాంతం మాత్రం వెనుకబడిందనే భావన ప్రజల్లో పెరుగుతోంది&period; ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోతే సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు కూడా ప్రజల సమస్యలకు కారణమవుతున్నాయి&period; 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం కొనసాగినా… ఇక్కడ మాత్రం వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు&period; అయితే ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి&period; ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని&comma; సమస్యలు వినిపించుకునే పరిస్థితి లేదని గ్రామస్థులు చెబుతున్నారు&period; దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు&period; ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరుగుతుండగా… మరోవైపు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు&period; రాజకీయ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం అభివృద్ధి మందగించిందనే అభిప్రాయం బలపడుతోంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు టిడిపి పార్టీలో ఏర్పడిన పరిస్థితులు కూడా తంబళ్లపల్లె రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి&period; గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన జయచంద్రా రెడ్డి నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ కావడంతో పార్టీకి ఇన్‌చార్జ్ లేకుండా పోయింది&period; దీంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు మందగించాయి&period; ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడంతో రాజకీయ శూన్యత నెలకొంది&period; పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తక్షణమే ఇన్‌చార్జ్‌ను నియమించాలని టిడిపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు&period; అలాగే నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు&period; అభివృద్ధి&comma; రాజకీయ స్థిరత్వం రెండూ కలిసొస్తేనే తంబళ్లపల్లె అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు&period;జనసేన &comma; బీజేపీ నేతలు కూడా యాక్టీవ్ గా లేకపోవడంతో సమస్యలు పరిష్కరించే నాధుడే లేడని ప్రజలు అంటున్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..