దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు.

Advertisements

<p>పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇటీవల ప్రధాని మోదీ&period;&period; పార్లమెంట్ ఉభయసభల్లో ఇరాన్ వార్ తో ఇబ్బందులు తప్పవని&comma; సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు&period; అయితే ఈ సూచనను సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు&period; మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ ఊదరగొడుతున్నారు&period; ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించాల్సి వచ్చింది&period; దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు&period; రాజ్యసభలో 2026 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ&period;&period; ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి ఆధార రహితమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు&period; దేశంలో కోవిడ్ తరహా పరిస్థితులు మళ్లీ రావని&comma; ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; లాక్‌డౌన్ భారత్‌లో లేదని&period;&period;పాకిస్తాన్‌లో జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు&period; మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాల వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ&comma; దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..