హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం..

Advertisements

<p>హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది&period; ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం&comma; అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది&period; ఈ పరిణామం ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది&period;ముఖ్యంగా చైనా&comma; భారత్‌లకు పెను సవాళ్లు విసురుతోంది&period;<&sol;p>&NewLine;<p>హర్మూజ్ జలసంధితో సహా ఇరాన్‌లోని కీలక ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది&period; హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనానికి ఇరాన్ పోర్టుల్లో దాదాపు 10 వేల మంది సైనికులు&comma; మెరైనర్లు&comma; వైమానిక దళ సిబ్బందిని అమెరికా మోహరించింది&period; ఈ బలగాలతోనే ఇరాన్ ఓడరేవులకు వెళ్లి&comma; వచ్చే నౌకలను అడ్డుకుంటోంది&period; దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి&period; యుద్ధానికి ముందు ఇది 70 డాలర్ల స్థాయిలో ఉండేది&period;<&sol;p>&NewLine;<p>హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అమెరికా అడ్డుకోవడంతో ఆ ప్రభావం భారత్&comma; చైనాలపై పడుతోంది&period; ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే దేశం చైనా&period; తాజా దిగ్బంధనం వల్ల చైనాకు అందే 1&period;8 మిలియన్ బ్యారెల్స్ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది&period; దీనిపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ&comma; అమెరికా చర్యను బాధ్యతారాహిత్యంగా పేర్కొంది&period; ఇక భారత్ నేరుగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకోక పోయినప్పటికీ&comma; ఇతర మార్గాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది&period;<&sol;p>&NewLine;<p>భారత్‌కు అవసరమైన గ్యాస్ ఎక్కువ భాగం ఈ జలసంధి ద్వారానే వస్తుంది&period; సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రభుత్వం ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లపై రేషనింగ్ విధించడమే కాకుండా డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ గడువును కూడా పెంచింది&period; ఇదే సమయంలో చమురు ధరలు పెరగడం వల్ల భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరుగుతోంది&period; ఇది దేశీయంగా పెట్రోల్&comma; డీజిల్ à°§à°°à°² పెంపునకు&comma; ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు గల్ఫ్ దేశాల్లో సుమారు 80-90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు&period; ఈ యుద్ధ వాతావరణం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే&comma; భారత్‌కు వచ్చే100 బిలియన్ డాలర్ల వార్షిక విదేశీ నగదు తగ్గిపోయే ప్రమాదం ఉంది&period; హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచంలోని 20&percnt; చమురు&comma; గ్యాస్ రవాణా అవుతుంది&period; అమెరికా కేవలం ఇరాన్ నౌకలనే లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నప్పటికీ&comma; భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు&comma; ఫ్రైట్ ఛార్జీలు పెరగడం వల్ల అన్ని దేశాలకు నష్టం తప్పడం లేదు&period; శాంతి చర్చలు మళ్ళీ ప్రారంభమైతేనే మార్కెట్లు స్థిరపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..