సీజ్‌ఫైర్‌కు అంగీకరించిన ఇరు దేశాలు..

Advertisements

<p>అమెరికా&comma; ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం తాత్కాలికంగా చల్లబడింది&period; రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కు ఆయా దేశాలు అంగీకరించాయి&period; ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి&period; ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపై ఈ నెల 10à°¨ ఇస్లామాబాద్‌లో ఇరు పక్షాలు చర్చించనున్నాయి&period; ఇరాన్‌పై చేపట్టాలనుకున్న సైనిక దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు&period; తాను విధించిన గడువు ముగియడానికి కేవలం 90 నిమిషాల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను తగ్గించింది&period; అయితే&comma; ఇరాన్ తక్షణమే హార్ముజ్ జలసంధిని రెండు వారాల పాటు సురక్షితంగా తెరవాలనే షరతుకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు&period; దీనిని ఇరుపక్షాల కాల్పుల విరమణగా ఆయన అభివర్ణించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందు&comma; ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది అంటూ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేయడం ప్రపంచదేశాల్లో ఆందోళనను రేకెత్తించింది&period; అయితే&comma; ఇరాన్ నుంచి వచ్చిన 10 సూత్రాల ప్రతిపాదన చర్చలకు ఆమోదయోగ్యంగా ఉందని ట్రంప్ పేర్కొనడంతో వాతావరణం మారింది&period;<&sol;p>&NewLine;<p>అమెరికా&comma; ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది&period; రానున్న రెండు వారాలపాటు హార్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్టు ఇరాన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు&period; దీంతో అమెరికా&comma; ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ధ్రువీకరించబడింది&period; సాంకేతిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ&period;&period; ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్ తో కాల్పుల విరమణ అమలులో ఉండనున్న 14 రోజులు హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేస్తునట్టు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్‌పై భారత్ రియాక్ట్ అయింది&period; కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది&period; ఇరుదేశాల నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపింది&period; ఈ ఒప్పందం పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారి తీస్తుందని అభిప్రాయపడింది&period; ఉద్రిక్తతలు తగ్గించడం కోసం దౌత్యపరమైన చర్చలు అవసరమని భారత్ మొదటి నుంచి చెబుతోంది&period; ఈ సంఘర్షణ ప్రపంచ దేశాలకు&comma; ప్రజలకు ఇప్పటికే ఎంతో ఇబ్బందికర పరిణామాలను కలిగించిందని&period;&period;ఇంధన సరఫరా&comma; వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపించాయని ఆందోళన వ్యక్తం చేసింది&period; తాజా యుద్ధ విరమణ ఒప్పందం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>ఇదిలా ఉంటే ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది&period; ఇరాన్‌ను సమూలంగా దెబ్బతీస్తానని ప్రకటించి&comma; మధ్యలోనే యుద్ధ విరమణకు అంగీకరించడంపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది&period; ఇది చారిత్రక తప్పిదమంటూ అక్కడి ప్రతిపక్షాలు&comma; రక్షణ రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు&period;<br &sol;>&NewLine;ఈ ఒప్పందం ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ వైఫల్యమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటే&period;&period; ఇరాన్‌పై పూర్తిస్థాయి విజయం సాధించకుండానే వెనక్కి తగ్గడం&comma; ఓటమిని అంగీకరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period; ఈ విరామ సమయాన్ని ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను పునరుద్ధరించుకోవడానికి వాడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; మరోవైపు&comma; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్లే నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నారని&comma; దీనివల్ల ఇజ్రాయెల్ స్వతంత్ర రక్షణ విధానం దెబ్బతిన్నదని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు&period; ఒప్పందం నుంచి హెజ్బుల్లాను మినహాయించినప్పటికీ&comma; ఇరాన్‌కు ఊరటనివ్వడం వల్ల ప్రాంతీయంగా ముప్పు తొలగిపోదని స్పష్టం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..