67
తాండూర్ లో భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో తాండూర్ పట్టణంలోని ప్రధాన వీధులలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్ఓ కార్యాలయంలో 4వ సారి నామినేషన్ వేశారు. గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఎంతో నమ్మకం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే అది అమలు చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉందని చెప్పారు.
Read Also..