విజయ్ చరిత్ర సృష్టిస్తాడా, చతికిలబడతాడా? ప్రభావం ఎంత?

విజయ్ పార్టీ టీవీకే అనూహ్య ఆధిక్యం

Advertisements

<p>శ్రావణ్ బాబు&comma; ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్<&sol;p>&NewLine;<p>విజయ్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి&period; రజనీకాంత్ చేయలేకపోయిన రాజకీయరంగ ప్రవేశమనే సాహసాన్ని చేసినందుకు&period; రాజకీయాలలో ప్రవేశించటమే కాదు&comma; బీజేపీ&comma; కాంగ్రెస్&comma; అన్నాడీఎంకే వంటి ఎన్నిపార్టీలు పొత్తు పెట్టుకుందామన్నా&comma; నిరాకరించి ముఖ్యమంత్రి కావటమే లక్ష్యంగా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకారు&period; మరి అతను ఈ ఎన్నికల తర్వాత కింగ్ అవుతాడా&comma; కింగ్ మేకర్ అవుతాడా&comma; అసలు అతని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది పరిశీలిద్దాం&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో ఇప్పటివరకు సినీరంగంనుంచి అన్నాదురై&comma; కరుణానిధి&comma; ఎంజీఆర్&comma; జయలలిత రాజకీయాలలో ప్రవేశించి ముఖ్యమంత్రులయ్యారు&period; వారి బాటలోనే సీఎమ్ అవ్వటం లక్ష్యంగా విజయ్ వచ్చారు&period; అయితే ఇక్కడ ఒక తేడా ఉంది&period; వారందరూ రాజకీయాలలోకి ఓవర్ నైట్ వచ్చి ముఖ్యమంత్రులైపోలేదు&period; ఎంతోకాలం రాజకీయాలలో ఢక్కాముక్కీలు తిని&comma; విశేష అనుభవం గడించిన తర్వాత ప్రజల మెప్పు పొంది ముఖ్యమంత్రులయ్యారు&period;<&sol;p>&NewLine;<p>విజయ్ ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో&period; సినీ కుటుంబంనుంచే వచ్చారు&period; అతని తండ్రి చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు&period; ఆయనే అతనిని హీరోగా లాంచ్ చేశారు&comma; మెంటార్ చేశారు&comma; ప్రణాళికాబద్ధంగా అతని కెరీర్ ను నిర్మించారు&period; డాన్సులు&comma; కామెడీ&comma; ఫైట్స్ విజయ్ బలాలు&period; అతని ఖాతాలో అనేక బంపర్ హిట్ సినిమాలు ఉన్నాయి&period; వాటిలో అనేక సినిమాలు తెలుగు రీమేకులు కావటం విశేషం&period; మహేష్ ఒక్కడు&comma; పోకిరి సినిమాల రీమేకులు అతనికి మంచి లైఫ్ ఇచ్చాయి&period; పవన్ కళ్యాణ్ తమ్ముడు&comma; బద్రి సినిమాల రీమేకులలో కూడా నటించి విజయ్ హిట్లు కొట్టారు&period; తన నటనలో అక్కడక్కడా పవన్&comma; మహేష్ ఛాయలు కనబడుతుంటాయి&period; ప్రస్తుతం ఒక్కో సినిమాకు విజయ్ దాదాపు రు&period;150 కోట్లు తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p>2024 ఫిబ్రవరి 2 à°¨ తమిళగ వెట్రి కళగం&lpar;టీవీకే&rpar; పార్టీని ప్రారంభించారు&period; తమకు రాజకీయ శత్రువు డీఎంకే అని&comma; సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని ప్రకటించారు&period; అవినీతి నిర్మూలన&comma; సామాజిక న్యాయం&comma; తమిళ ఆత్మగౌరవం లక్ష్యాలని వక్కాణించారు&period; పార్టీ ప్రారంభించి రెండేళ్ళు పైనే అయినప్పటికీ 7-8 నెలలనుంచే చురుకుగా కార్యకలాపాలు నడుపుతున్నారు&period; అది కూడా&comma; మొదట్లో కేవలం శని&comma; ఆదివారాలలో మాత్రమే సభలలో పాల్గొనేవారు&period;<&sol;p>&NewLine;<p>విజయ్ అనుకూల అంశాలు<&sol;p>&NewLine;<p>1&period; దశాబ్దాలుగా డీఎంకే&comma; అన్నాడీఎంకే… రెండు పార్టీల పాలకులనే చూసి విసిగిపోయిన ప్రజలకు ఇప్పుడు విజయ్ ద్వారా ఒక మూడో ఛాయిస్ ఏర్పడింది&period; ఆ రకంగా విజయ్ పార్టీ టీవీకేకు ఒక అడ్వాంటేజ్ ఏర్పడింది&period; దానికితోడు కొత్త పార్టీ కావటంతో అవినీతి మరక ఉండదు&period;<&sol;p>&NewLine;<p>2&period; పాపులర్ హీరో కావటంతో విజయ్ పై యువతలో బాగా ఆకర్షణ ఉంది&period; అతనంటే ప్రాణాలిచ్చే యువతీ యువకులు చాలామందే ఉన్నారు&period; ముఖ్యంగా జెన్ జీ విజయ్ సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు&period; అయితే వారందరూ విజయ్ పార్టీకి ఓట్లు వేస్తారా అనేదే ఇక్కడ వేచి చూడాల్సిన విషయం&period;<&sol;p>&NewLine;<p>3&period; విజయ్ క్రైస్తవ మతానికి చెందినవారు కావటంతో ఆ వర్గం ఓట్లను బాగా ఆకర్షించే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>4&period; విజయ్ కు నిధుల కొరత లేదు&period; లాటరీ కింగ్ గా తమిళనాడులో చెప్పుకునే అథర్వ అర్జున్ అనే అతను టీవీకేకు నిధులు సమకూరుస్తున్నాడని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>5&period; విజయ్ ఎంతోకాలంనుంచి దానాలు&comma; విరాళాలు పెద్ద సంఖ్యలో చేశారు&comma; విద్యార్థినీ&comma; విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>విజయ్ ప్రతికూల అంశాలు<&sol;p>&NewLine;<p>1&period; పార్టీకి సరైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు&period;<&sol;p>&NewLine;<p>2&period; కరూర్ తొక్కిసలాట ఘటనలో 40 మంది చనిపోయిన ఘటన ఒక పెద్ద మరకగా మిగిలిపోయింది&period; ముఖ్యంగా ఆ ఘటనపై విజయ్ స్పందించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది&period; ఘటన జరిగిన వెంటనే విజయ్ మీడియాకు దొరకకుండా పారిపోవటం&comma; రెండు రోజుల తర్వాత మీడియాకు వీడియో బైట్ పంపించటం&period; ముఖ్యంగా&comma; ఆ బైట్ లో కూడా ఎక్కడా అతని ముఖంలో జరిగినదానికిగానూ బాధపడుతున్న ఛాయలు కొద్దిగా కూడా కనబడకపోవటం&period; అతను అలా కాకుండా&comma; కనీసం మరుసటి రోజైనా పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి బాధితులను పరామర్శించి&comma; వారికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుని ఉంటే మంచి పేరు వచ్చిఉండేది&period;<&sol;p>&NewLine;<p>3&period; పార్టీ ప్రచార కార్యక్రమాలు&comma; సభలలో విజయ్ చురుకుగా పాల్గొనకపోవటం&period; బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ జరిగిన తర్వాత చివరి క్షణంలో అతను దానిని క్యాన్సిల్ చేసుకుని వీడియో సందేశం పంపుతున్నారు&period; దీనిపై సభకు వచ్చినవారిలో&comma; అతని అభిమానులలో కూడా అసంతృప్తి ఏర్పడుతోంది&period;<&sol;p>&NewLine;<p>4&period; విజయ్ వైవాహిక జీవితం రోడ్డెక్కటం మరో మైనస్ పాయింట్&period; ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అతని భార్య సంగీత విడాకులకోసం కోర్టు మెట్లు ఎక్కారు&period; అతనికి ఒక ప్రముఖ నటితో సంబంధం ఉందని ఆమె విడాకుల పిటిషన్లో ఆరోపించారు&period; ఇది జరిగిన కొద్ది కాలానికే విజయ్ ఒక శుభకార్యంలో హీరోయిన్ త్రిషతో కలిసి హాజరవటం సంచలనంగా మారింది&period; మరోవైపు విజయ్ కొడుకు కూడా అతనిని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యి&comma; తన పేరులోని విజయ్ ను తొలగించుకున్నారన్న వార్తలు వచ్చాయి&period; ఈ వ్యవహారం మొత్తం వలన ఓటర్ల మనసులో&comma; ముఖ్యంగా మహిళా ఓటర్లలో అతని ఇమేజికి చెడే కానీ మంచి అయితే జరగదు&period;<&sol;p>&NewLine;<p>5&period; విజయ్ కు క్లీన్ ఇమేజ్ అయితే లేదు&period; తాను కొన్న అతి ఖరీదైన రోల్స్ రాయిస్ కారుకు పన్ను తప్పించుకోవటంకోసం తప్పుడు లెక్కలతో అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణ ఉంది&period; దానిపై కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>6&period; పార్టీ పెట్టి రెండేళ్ళు దాటినా&comma; ఇప్పటికీ విజయ్ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు&period; మహా అయితే ఏదైనా విషయంపై స్పందించాలంటే వీడియో బైట్లు వదులుతున్నారు&period; ఇది ఆయనలోని ఆత్మవిశ్వాస లేమిని&comma; నాయకత్వ లక్షణాల లేమిని చూపుతోంది&period; ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి రెండేళ్ళు దాటినా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడకపోవటం అనేది ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగని విషయం&period;<&sol;p>&NewLine;<p>ట్రయాంగిల్ ఫైట్<&sol;p>&NewLine;<p>కొన్ని దశాబ్దాలుగా రెండే ప్రధాన పక్షాల మధ్య ముఖాముఖి పోటీగా నడుస్తున్న ఎన్నికల పోరు&comma; విజయ్ ప్రవేశంతో ఈ సారి ముక్కోణపు పోటీగా మారింది&period; అధికార డీఎంకే కూటమిలో కాంగ్రెస్&comma; విజయకాంత్ పార్టీ&comma; వీసీకే అనే దళితపార్టీ&comma; కమ్యూనిస్ట్ పార్టీ వంటి మొత్తం 14 పార్టీలు ఉన్నాయి&period; అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ&comma; వన్నియార్ల పీఎంకే పార్టీ&comma; టీఎంసీ వంటి 12 పార్టీలు ఉన్నాయి&period; విజయ్ పార్టీ టీవీకే మొత్తం 234 స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తోంది&period; పేరుకు ఇంకో పార్టీ ఎన్టీకే కూడా మొత్తం 234 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నా&comma; దాని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుంది&period; కారణం &&num;8211&semi; ఆ పార్టీ అధినేత సీమన్ ఎత్తుకున్న తమిళ జాతీయవాదం&period; 800 &&num;8211&semi; 1000 సంవత్సరాలకు ముందునుంచి తమిళనాడులో ఉన్నవారే రాష్ట్రాన్ని ఏలాలి అనేది ఆయన వాదం&period; ముఖ్యంగా&comma; 500 ఏళ్ళనుంచి తమిళనాడులో ఉంటున్న తెలుగువారు టార్గెట్ గా ఆయన ఈ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తుంటారు&period; అయితే ఆ వాదానికి పెద్దగా సపోర్ట్ లేకపోవటంతో ఆయనకు 6 &&num;8211&semi; 8 ఓట్ల శాతం మాత్రమే దక్కుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p>డీఎంకే ప్లస్&comma; మైనస్ లు<&sol;p>&NewLine;<p>డీఎంకే ప్రభుత్వ పాలనపై ప్రధానంగా వినబడే విమర్శ &&num;8211&semi; శాంతి భద్రతల సమస్య&period; ఆడవారిపై&comma; బాలికలపై అత్యాచారాలు&comma; హత్యలు విపరీతంగా పెరిగాయి&period; మరోవైపు గంజాయి వంటి మత్తుమందుల వాడకం తీవ్రంగా పెరిగింది&period; అవినీతి పెరిగిందనే ఆరోపణలు కూడా బాగానే వినబడుతున్నాయి&period; కావేరి డెల్టాలోని రైతులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు&period; అయితే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కూడా లేదు&period;<&sol;p>&NewLine;<p>డీఎంకే బలం ఆ పార్టీకి ఉన్న పటిష్ఠమైన వ్యవస్థాపక నిర్మాణం&period; అది కార్పొరేట్ స్థాయిలో సమన్వయంతో సాగుతూ ఉంటుంది&period; గత ఐదేళ్ళనుంచి సరిగ్గా పనితీరు కనబరచలేకపోయిన 60 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు నిరాకరించి&comma; వారి స్థానాలలో కొత్తవారికి అవకాశం కల్పించారు&period; డీఎంకే మరోబలం క్రైస్తవ&comma; ముస్లిమ్ ఓట్ బ్యాంకు&period; తమిళనాడులో మైనారిటీల ఓట్లు మొదటినుంచీ డీఎంకేకు పడుతూ ఉంటాయి&period; ఇక&comma; అధినేత స్టాలిన్ తమిళనాడు హక్కులకోసం&comma; డీలిమిటేషన్ కు వ్యతిరేకంగ కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఎదుర్కోవటం కూడా ఒక పాజిటివ్ పాయింట్&period;<&sol;p>&NewLine;<p>అన్నాడీఎంకే ప్లస్&comma; మైనస్ లు<&sol;p>&NewLine;<p>అన్నాడీఎంకేకు బలమైన సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది&period; ముఖ్యంగా మహిళల ఓట్లు ఎక్కువగా ఆ పార్టీకి పడుతుంటాయి&period; బీజేపీ భాగస్వామి కావటం మరో పెద్ద ప్లస్ పాయింట్&period; దీనివలన ఆర్థిక వనరుల సమస్య తలెత్తే సమస్యే ఉండదు&period; పళనిస్వామి&comma; అన్బుమణి రాందాస్ వలన గౌండర్&comma; వన్నియార్ ఓట్లు బాగానే చీల్చుకోగలుగుతారు&period;<&sol;p>&NewLine;<p>అన్నాడీఎంకే మైనస్ లు చూస్తే&comma; జయలలిత తర్వాత కరిష్మా ఉన్న పెద్ద నేత ఎవరూ లేకపోవటం ప్రధానమైన నెగెటివ్ పాయింట్&period; విజయ్ పెట్టిన కొత్తపార్టీ వలన అన్నాడీఎంకేకు పడవలసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటులో గండి పడటం రెండో నెగెటివ్ పాయింట్&period; విజయకాంత్ పార్టీ ఎండీఎంకే ఈ కూటమినుంచి వైదొలిగి డీఎంకే కూటమిలో చేరటం మరో పెద్ద దెబ్బ&period; పళనిస్వామి వ్యవహారశైలికి నిరసనగా పనీర్ సెల్వం&comma; సెంగొట్టయ్యన్ వంటి పలువురు సీనియర్ అన్నాడీఎంకే నేతలు బయటకు వెళ్ళిపోయారు&period; దేవర్&comma; వన్నియార్ కులాలు అన్నాడీఎంకేకు దూరమయ్యాయి&period; ఏది ఏమైనా అన్నాడీఎంకే గ్రాఫ్ నానాటికీ తగ్గుతోందన్నది నిజం&period;<&sol;p>&NewLine;<p>కుల ప్రభావం<&sol;p>&NewLine;<p>తమిళనాడు ద్రవిడ పార్టీలన్నీ సిద్ధాంతపరంగా కులరహిత సమాజం కావాలని ఘోషిస్తున్నప్పటికీ&comma; అక్కడ కులాలే ముఖ్యపాత్ర పోషిస్తూ రావటం ఒక విచిత్రమైన పరిణామం&period; అయితే ఈ ఎన్నికలలో మాత్రం కులాలు అతి తక్కువ ప్రభావం చూపుతాయని అంటున్నారు&period; దానికి కారణాలను చూద్దాం&period;<br &sol;>&NewLine;తమిళనాడులో ముఖ్యంగా ఉత్తరాన వన్నియార్ కులం&comma; దక్షిణాన దేవర్ కులం&comma; పశ్చిమాన గౌండర్ కులం ప్రధానంగా ఇప్పటిదాకా రాజకీయాలను శాసిస్తూ వచ్చాయి&period; అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారింది&period; ఏ కులం ఓట్లూ గంపగుత్తగా ఒకపార్టీకి పడేటట్లుగా ఇప్పుడు లేదు&period;<&sol;p>&NewLine;<p>ఉదాహరణకు తీసుకుంటే &&num;8211&semi; వన్నియార్ల ఓట్లన్నీ పీఎంకే పార్టీకి పడేవి&period; వన్నియార్ల పార్టీ పట్టాళి మక్కళ్ కచ్చి అధినేత రాందాసుకు&comma; ఆయన సుపుత్రుడు అన్బుమణికి మధ్య విభేదాలు రావటంతో ఈయన ఒక కూటమిలోకి&comma; ఆయన మరో కూటమిలోకి వెళ్ళారు&period; 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే పీఎంకే ప్రభావం దారుణంగా పడిపోయింది&period;<&sol;p>&NewLine;<p>ఇక దేవర్ కులం సంగతి చూస్తే&comma; ఇంతకుముందు దేవర్ల ఓట్లు గంపగుత్తగా అన్నాడీఎంకేకు పడేవి&period; దానికి కారణం ఆ కులానికి చెందిన ఓ పన్నీర్ సెల్వం&comma; దినకరన్&comma; శశికళ తదితరులు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం&period; గౌండర్ కులస్థుడైన పళనిస్వామి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో దేవర్ల ప్రాబల్యం తగ్గింది&period; దానికితోడు మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం డీఎంకే పంచన చేరటంతో దేవర్ కులం ఓట్లు రెండు కూటముల మధ్య పంచుకోబడుతున్ననాయి&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమప్రాంతమైన కొంగునాడులో మొదటినుంచి గౌండర్ కులం ప్రాబల్యం బాగా ఉంటుంది&period; ఇది అన్నాడీఎంకే కంచుకోట&period; అయితే ఇటీవల గౌండర్ల ఓట్లు కొల్లగొట్టటంకోసం స్టాలిన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు&period; సెంథిల్ బాలాజీ అనే మంత్రికి ప్రత్యేకంగా ఆ బాధ్యతలు అప్పగించారు&period; ఇప్పుడు గౌండర్ ఓట్లలో చీలిక కనపడుతోంది&period;<&sol;p>&NewLine;<p>వర్తక వాణిజ్యాలలో ఎక్కువగా ఉండే నాడార్లు మరో పెద్ద కులం&period; కామరాజ్ నాడార్ కారణంగా వారు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీతో ఉండేవారు&period; తర్వాత అన్నాడీఎంకేకు దగ్గరయ్యారు&period; కానీ&comma; జయలలిత చనిపోయిన తర్వాత పార్టీలో గౌండర్&comma; వన్నియార్ల ప్రాబల్యం పెరగటంతో అన్నాడీఎంకేకు దూరమయ్యారు&period; వారిని దువ్వటానికి డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది&period; డీఎంకే ఎంపీ కనిమొళి ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు&period; తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళిసై&comma; తమిళనాడు బీజేపీ సీనియర నాయకుడు పొన్ రాథాకృష్ణన్ నాడార్ సామాజికవర్గానికి చెందినవారు&period; కాబట్టి నాడార్లలో కూడా గంపగుత్తగా ఒక కూటమికి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు కనబడటంలేదు&period; మొత్తం మీద చూస్తే గతంలోలా ఒక కులం ఓట్లన్నీ ఒక పార్టీకి పడే పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p>అన్నామలై<&sol;p>&NewLine;<p>ఈ ఎన్నికల్లో అన్నామలైను పక్కన పెట్టటానికి ఒక కారణం వినబడుతోంది&period; 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తే&comma; ససేమిరా అంటూ అన్నామలై అడ్డుపడ్డారు&comma; ఒంటరిగా వెళ్ళేలా చేశారు&period; తీరా చూస్తే ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి&period; పొత్తు పెట్టుకుని ఉంటే మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవాళ్ళమని భావించిన మోదీ-à°·à°¾ ద్వయం&comma; అన్నామలైను పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతోపొత్తు పెట్టుకుంది&period; 2024లో ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమలనాథులను ఒప్పించటం వలన జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలోకి రావటానికి మార్గం సుగమం అయితే&comma; అన్నామలై మాట వినటం వలన చెడు జరిగిందని ఆ పార్టీ అధిష్ఠానం భావించినట్లుగా కనబడుతోంది&period;<&sol;p>&NewLine;<p>అన్నట్టు&comma; 2024 పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే కూటమి 100&percnt; స్ట్రైక్ రేటుతో మొత్తం 39 స్థానాలనూ చేజిక్కించుకుంది&period; మొత్తంమీద&comma; ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నాడీఎంకే కూటమికి&comma; విజయ్ టీవీకే పార్టీకి మధ్య చీలుతుంది కాబట్టి డీఎంకే కూటమికి ప్రయోజనం చేకూరుతుందని స్థూలంగా చూస్తే అనిపిస్తుంది&period; అయితే డీఎంకేకు సంప్రదాయంగా పడుతూ వస్తున్న మైనారిటీ ఓటులో విజయ్ గణనీయంగా చీల్చగలిగితే మాత్రం డీఎంకేకు కష్టమవుతుంది&period; అయితే ఇదంతా విజయ్ ను ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా జనం పరిగణనలోకి తీసుకుంటే ఏర్పడే పరిస్థితి&period; అతని మాటలను&comma; చేతలను బట్టి&comma; జనం సీరియస్ గా తీసుకోకపోతేమాత్రం డీఎంకేకు<br &sol;>&NewLine;నల్లేరు మీద నడకే అవుతుంది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.