విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొచ్చాయి.

Advertisements

<p>విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొచ్చాయి&period; విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు&period; భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని&comma; అందుకోసం యుద్ధం ప్రారంభించామని వెల్లడించినట్లు తెలుస్తోంది&period; ఆల్ ఖైదా&comma; ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నామని&comma; ఈ మార్గాన్ని తమకు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అల్ హకీం షుకూర్ చూపించాడని వారు పోలీసు కస్టడీలో సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం&period; అలాగే &&num;8220&semi;భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయాలన్న నినాదాలతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నింపేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు&period; ఇస్లాంను విశ్వసించని వారిపై సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశామని&period;&period;జిహాద్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిని తమకు అప్పగించినట్టు వెల్లడించారు&period; దేశంలోని స్లీపర్‌ సెల్స్‌ను త్వరలో పరిచయం చేస్తామని చెప్పారని&period;&period;అంతలోనే తాము అరెస్టైనట్టు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి&comma; పాకిస్థాన్&comma; ఆఫ్ఘనిస్థాన్‌లకు పంపి మిలిటెంట్ శిక్షణ ఇప్పించాలని షుకూర్ కుట్ర పన్నినట్టు తెలిపారు&period; ఇందుకోసం &&num;8216&semi;బెన్ ఎక్స్ డాట్ కామ్&&num;8217&semi; పేరుతో సోషల్ గ్రూపును ఏర్పాటు చేసి&comma; దేశంలోని పలు రాష్ట్రాల యువతకు గాలం వేశారు&period; దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గత నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్&comma; మహమ్మద్ రహంతుల్లా షరీఫ్&comma; మీర్జా సోహైల్ బేగ్‌లను అరెస్టు చేయడంతో ఈ నెట్‌వర్క్ గుట్టురట్టయింది&period; వీరిచ్చిన సమాచారంతో 11 మందిని అరెస్టు చేశారు&period; తాజాగా ఏపీ సీఐడీ అధికారులు ఏడుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు&period; కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచి&comma; రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు&period; ఈ విచారణలో మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ లింకులు ఉన్నట్లు&comma; కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలను అధికారులు గుర్తించారు&period; వీరిలో కొందరికి 25 నుంచి 40 వరకు వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు&period; ఈ కేసు తీవ్రత దృష్ట్యా&comma; NIA రంగంలోకి దిగింది&period; ఇప్పటికే ఏపీ పోలీసులకు సహకారం అందిస్తున్న NIA&period;&period; త్వరలోనే ఈ కేసును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.