62
ప్రైవేట్ వ్యక్తులచే టిడిపి ఓటర్ వెరిఫికేషన్ చేయించడంపై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఓటిపిల సేకరణతో ఫోన్లు హ్యాకింగ్ చేసే ప్రమాదం కూడా ఉందని, గతంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. ప్రభుత్వం కేటాయించిన బిఎల్ఓ లు, పార్టీల బిఎల్ఏలు మినహా ఎవరు ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ఓటిపిలు అడిగిన పోలీస్ స్టేషన్ కు అప్పగించడం తథ్యం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.