72
గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శించారు. ఈ నేపద్యంలో వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య స్పందించారు. బోనస్ బకాయిలు అడగటానికి వచ్చిన టీడీపీ సర్పంచులపై దాడి చేసి కేసు నమోదు అయితే పరారైన ధూళ్లీపాళ్ల నరేంద్ర మమ్మల్ని విమర్శించేది స్తాయి కాదన్నారు. పాడి రైతు ముసుగులో అక్రమంగా సంగం డెయిరిని కబ్జా చేసారన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలుగా ఏ చిన్న అభివృద్ధి కూడా చేయకుండా కేవలం దౌర్జన్యం చేస్తూ పబ్బం గడిపారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి ఓడించేందుకు పొన్నూరు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.
Read Also..
Read Also..