నరసాపురంలో మళ్లీ చెత్త సమస్య తీవ్రం…

నరసాపురంలో మళ్లీ చెత్త సమస్య తీవ్రం

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చెత్త సమస్య మళ్లీ భయంకర రూపం దాల్చింది&period; విజయవాడకు వెళ్లే 216 రహదారి వెంట ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; గతంలో ఇదే విషయంపై వరుస కథనాలను CVR NEWS ప్రచారం చేయడంతో తాత్కాలికంగా ఈ సమస్య తగ్గినా … ఇప్పుడు మళ్లీ మొదలైంది&period; వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ఈ సమస్య పరిష్కారం కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చెత్త సమస్య మళ్లీ తీవ్ర రూపం దాల్చింది&period; విజయవాడకు వెళ్లే 216 రహదారి పక్కనే ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; ఒకప్పుడు ఈ సమస్యపై స్పందన వచ్చినా… ప్రస్తుతం పరిస్థితి మళ్లీ అదుపుతప్పింది&period; పట్టణంలోని గుడులు&comma; బడులు &comma; ప్రార్థన స్థలాల పరిసరాల్లో కూడా చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి&period; రహదారి పక్కనే చెత్తను పడేస్తుండటంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డ్‌లా మారింది&period; దీంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు&period; చెత్త నిర్వహణలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>చెత్త పేరుకుపోవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది&period; దోమలు విపరీతంగా పెరగడంతో డెంగ్యూ&comma; వైరల్ ఫీవర్స్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు&period; ముఖ్యంగా చిన్నపిల్లలు&comma; గర్భిణీలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; చెత్తను తరలించాల్సిన మున్సిపాలిటీ సిబ్బంది… అక్కడికక్కడే దానిని కాల్చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; దీంతో హైవే అంతా పొగతో కమ్ముకుపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు&period; ప్రయాణం ప్రమాదకరంగా మారిందని డ్రైవర్లు చెబుతున్నారు&period; పరిస్థితి మరింత దిగజారుతుందన్న భయం ప్రజల్లో పెరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పిన నాయకులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు&period; ముఖ్యంగా గోదావరి పుష్కరాల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది&period; లక్షలాది మంది భక్తులు వచ్చే సమయంలో పట్టణం చెత్తతో నిండిపోతే ఎలా నిర్వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు&period; ఇప్పటికైనా అధికారులు&comma; ప్రజాప్రతినిధులు&comma; మున్సిపాలిటీ సిబ్బంది కలిసి పనిచేసి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..