రాజమండ్రి రూరల్ సీటు ఎవరిది ?

Rajahmundry Rural seat TDP Kanchkota

Advertisements

&NewLine;<p>రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ కంచుకోట అనడంలో ఎటువంటి సందేహం లేదు&period; 2019 జగన్ వేవ్ లో కూడా టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చియ్య చౌదరి గెలుపొందటమే ఉదాహరణగా చెప్పవచ్చు&period; 2&comma;56&comma;432 ఓటర్లు ఉన్నా ఈ నియోజకవర్గంలో బీసీలే అధికంగా ఉన్నారు&period; అదే అస్త్రంగా మలుచుకుంటు నియోజకవర్గానికి కంచుకోటగా మార్చుకున్నారు గోరంట్ల…&period;టిడిపి పార్టీ ఏర్పాటు నుండి పార్టీలో కోనసాగుతూ అప్పట్లో ఎన్టీఆర్ కు నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తొలిత రాజమండ్రి లో పోటీ చేసినప్పుటికి నియోజకవర్గాల పునర్విభజనలో రూరల్ లో పాగా వేశారు&period; అప్పటినుండి బలమైన నేతగా ఎదిగారు&period; ఒకానొక సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి రాక అలకపోని రాజీనామా వరకు వెళ్లిన పరిస్థితి&period; అయితే అధ్యక్షుడే రంగంలోకి దిగి బుజ్జగించడంతో వ్యవహారం సద్దుమణిగిందని చెబుతుంటారు&period; గోరంట్ల నియోజకవర్గంలో పట్టున్న నాయకుడు కావడంతో అదే గాలి ప్రక్కన నియోజకవర్గం రాజమండ్రి కూడా తాకిందని సిటీ గెలుపుకు అదే కారణమని కొందరు చెబుతుంటారు&period; ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జనసేన టిడిపి పొత్తుతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి&period; ఈ నేపథ్యంలో సీటుకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు కేటాయిస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచిచూడాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగన్ 175 నియోజకవర్గాలు టార్గెట్గా ఇన్చార్జుల మార్పులో భాగంగా ఈ నియోజకవర్గంలో బిసి సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుకు కేటాయిస్తున్నారని ప్రచారం బలంగా వినిపిస్తుంది&period; అయితే బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గెలుపుకు ఇదే అస్త్రంగా వైసిపి మార్చుకోబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు&period; గత ఎన్నికల్లో వైసిపి పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల వీర్రాజును వైసిపి పార్టీ పక్కన పెట్టింది&period; చందన రమేష్ వారసత్వాన్ని పుచ్చుకున్న చందన నాగేశ్వర్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది&period; గడపగడపకు తిరుగుతూ నాగేశ్వర్ జోష్ పెంచినప్పటికీ గ్రూప్ తగాదాలను తట్టుకోలేకపోతున్నాడని గుసగుసలు కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి&period; ఈ నేపథ్యంలోనే మంత్రి గారికి ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది&period; ఏది ఏమైనప్పటికీ రాజమండ్రి రూరల్ కడియం మండలాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రిగారు ఏ మాత్రం ఎదుర్కొంటారో చూడాలంటూ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..