టీడీపీ నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా? లేక పక్కన పెడతారా?

TDP leaders who met Pawan Kalyan

Advertisements

&NewLine;<p>ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే&period; టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు&period; అది పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ&period; తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు&period;&period; ఎప్పటి నుంచో చేస్తున్న పనే&period; అదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు&period; అయితే ఇప్పటి వరకూ అలాంటి చేరికలు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు&period; కానీ ఇక టీడీపీ నేతలు జనసేనలోకి వరస పెడుతుండటంతో జనసైనికుల అనుమానం నిజంగా మారనుంది&period; పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈసారి ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది&period; చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు అసవరం కావడంతో పవన్ కల్యాణ్ కు అడిగినన్ని కాకపోయినా&period;&period; హర్ట్ కాకుండా మెరుగైన సంఖ్యలోనే చంద్రబాబు సీట్లను ఇచ్చే అవకాశాలున్నాయి&period; దీంతో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతల సీట్లు కూడా పొత్తులో భాగంగా కోల్పోయే అవకాశముంది&period; ఇది గ్రహించిన నేతలు కొందరు టీడీపీలో ఉంటే సీట్లు రావని&comma; జనసేనలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు&period; పవన్ కల్యాణ్ కూడా అమాయకంగా వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆశ్చర్యపోవడం జనసైనికుల వంతయింది&period; నిన్న మాగంటి బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు&period; ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ&comma; కైకలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు&period; కానీ టీడీపీలో ఉంటే సీటు రాదేమోనని భావించి మాగంటి బాబు పవన్ పంచన చేరారు&period; ఆయన జనసేనలో చేరి ఈ రెండు స్థానాల్లో ఒకచోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు&period; అలాగే బూరగడ్డ వేదవ్యాస్ కూడా అంతే&period; ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు&period; టీడీపీలో సీటు డౌట్ కొట్టడంతో ఆయన పవన్ ను కలిశారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది&period; అయితే మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా చేరిక కోసమే వారు జనసేన కార్యాలయానికి వచ్చారని అంటున్నారు&period; ఇన్నాళ్లూ ఏం చేశారు&quest;నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారన్న ప్రశ్నను సోషల్ మీడియాలో జనసైనికులు వేస్తున్నారు&period; ఎన్నికల ముందు చేరుతున్నారంటే వీరిని టీడీపీ నేతలుగానే చూడాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు&period; అదే జరిగితే పవన్ కల్యాణ్ రాజకీయానికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి&period; అయినా వస్తున్న నేతలను కాదనలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది&period; టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా&quest; లేక పక్కన పెడతారా&quest; అన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా టీడీపీ నుంచి నేతల వలసలు పెద్దయెత్తున సాగుతాయన్న ప్రచారానికి ఇది అద్దం పడుతుందనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.