పశ్చిమ గోదావరిలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు..

Advertisements

<p>పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక చోట్ల ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు &period; ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు సివిఆర్ న్యూస్ ప్రతినిధుల పరిశీలనలో బయటపడింది&period; లిక్కర్ బాటిళ్లపై ₹10 వరకు అదనంగా వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి &period; బీర్ బాటిళ్లపై ₹20 నుంచి ₹30 వరకు ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు &period; బిల్లు అడిగితే &OpenCurlyDoubleQuote;మాకు తెలియదు”&comma; &OpenCurlyDoubleQuote;బిల్లు లేదు” అంటూ నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారు &period;<br &sol;>&NewLine;రాత్రి వేళల్లో కూడా అనధికారికంగా విక్రయాలు కొనసాగుతున్నాయి &period;గ్రామాలు&comma; పట్టణాలు అనే తేడా లేకుండా బెల్ట్ షాపుల ద్వారా అక్రమ అమ్మకాలు జరుపుతున్నారు &period;ఎక్సైజ్ శాఖ సరైన పర్యవేక్షణ చేయకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది &period;దింతో ఎక్సైజ్ శాఖ లోపాలు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి &period; ప్రభుత్వ నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకు మద్యం అమ్మకపోవడంతో మందుబాబుల జేబులకు బాగానే చిల్లు పడుతుంది &period; ఇంకో వైపు వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period; ఈ క్రమం లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ పెరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లాలో మద్యం అక్రమాలు రోజురోజుకూ పెరుగుతుండడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది &period; అధికారికంగా జిల్లాలో 175 బ్రాందీ షాపులు&comma; 25 బార్లు ఉన్నప్పటికీ…ఎక్సైజ్ శాఖ నియంత్రణ మాత్రం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; మరో వైపు ఎక్సైజ్ శాఖ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని చెబుతున్నా… గ్రౌండ్ లెవల్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ముఖ్యంగా బెల్ట్ షాపుల విస్తరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది&period; గ్రామాలు&comma; పట్టణాలు అన్న తేడా లేకుండా… గుడి&comma; బడి&comma; కాలనీలు&comma; ప్రధాన వీధులు అన్న తేడా లేకుండా… అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు బహిరంగంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; చిన్నపిల్లలు తిరిగే వీధుల్లో… మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో… విద్యార్థులు వెళ్లే మార్గాల్లో కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి&period;ఇలాంటి అక్రమాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న&period;<&sol;p>&NewLine;<p>ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్‌పై 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి&period;ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్మి షాప్ యజమానులు జేబులు నింపుకుంటున్నారు &period;<br &sol;>&NewLine;ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే… కొన్ని చోట్ల బిల్లు లేకుండానే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనేది వెలుగులోకి వస్తోంది&period;నిబంధనల ప్రకారం ప్రతి అమ్మకానికి బిల్లు తప్పనిసరి అయినప్పటికీ… ఎందుకు బిల్లులు ఇవ్వడం లేదు అనేది పెద్ద ప్రశ్నగా మారింది &period;<&sol;p>&NewLine;<p>మరోవైపు… రాత్రి 12 గంటల తర్వాత కూడా దాబాలు&comma; కొన్ని బార్లు నడుపుతున్నారు &period;<br &sol;>&NewLine;చట్టం ప్రకారం సమయ పరిమితులు ఉన్నా… అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి&period; రాత్రివేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడంతో యాక్సిడెంట్లు జరగడమే కాకుండా మహిళలను వేధించడం కుడి జరుగుతుంది&period; ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే పార్కులు… బస్ స్టాండ్లు… రోడ్ల పక్కన… కాలనీల్లో… చెరువుల దగ్గర… గ్రామాల్లో కూడళ్ల వద్ద… మందుబాబులు గుంపులుగా కూర్చొని తాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు&period; ఇది కేవలం చట్టవిరుద్ధం మాత్రమే కాదు… సామాజిక సమస్యగా మారుతోంది&period;<br &sol;>&NewLine;మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>చిన్నపిల్లలు&comma; మహిళలు తిరిగే ప్రాంతాల్లోనే బ్రాందీ షాపులు నడుస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి &period; ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి&period; పాఠశాలల దగ్గర… దేవాలయాల పక్కన… జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు&period; ఈ మొత్తం పరిణామాల మధ్య…ఎక్సైజ్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; ఇదిలా ఉంటే…నాటు సారా ముప్పు మళ్లీ తలెత్తుతోందనే సమాచారం బయటకు వస్తోంది&period; గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా తయారీ చేసి … గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది …నాటు సారా తక్కువ ధరలకు విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి&period; నాటు సారా అనేది ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు… ప్రాణాలకు ముప్పు కూడా&period; గతంలో ఇలాంటి నాటు సారా తాగిన ఘటనల్లో ఎన్నో కుటుంబాలు దెబ్బతిన్నాయి&period; అయినా ఇప్పటికీ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు &period;ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..