79
పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మహిళల నిర్బంధించారు. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అందులో ఒక వర్గం వైసీపీ నాయకులు కావడంతో మరో వర్గానికి చెందిన మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. వైసిపి నాయకుడి వర్గం ఫిర్యాదుతో 18 ఏళ్ల యువతిని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలను నిర్బందించినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కనీసం మహిళా హోంగార్డు కూడా రక్షణగా లేకుండా రాత్రి అంతా మహిళలను నిర్బంధించడంపై బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also…
Read Also…