72
అనంతపురం జిల్లా.. రాయదుర్గం పట్టణంలోని కోతుగుట్ట ఏరియాలో గత 15 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది. దీంతో కాలనీ నివాసులు అనంతపురం ప్రధాన రహదారిపై అరగంట పాటు బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ రోడ్డుపై బైఠాయించిన మహిళలకు సమాధానం చెబుతూ తమ సమస్యను కార్యాలయంలో తెలియజేయాలి రోడ్డుపై బైఠాయించడం సరి కాదన్నారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయం ముట్టడించారు.
మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలపడంతో మహిళలు తమ నిరసనను విరమించుకున్నారు.