ఏ క్షణంలోనైనా టన్నెల్ లో బయటకు రానున్న కార్మికులు

Workers coming out of the tunnel

Advertisements

&NewLine;<p>ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావొచ్చని అధికార వర్గాల సమాచారం&period; రెస్క్యూ పనులు తుది దశకు చేరుకున్నాయని&comma; టన్నెల్ కు సమాంతరంగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చివరకు వచ్చాయని అధికారులు చెప్పారు&period; వాస్తవానికి ఈ రోజు ఉదయమే కార్మికులను బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు&period; అయితే&comma; డ్రిల్లింగ్ పనుల చివరి దశలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయని&comma; చివర్లో ఇనుప రాడ్లు బయటపడడంతో డ్రిల్లింగ్ పనులు నెమ్మదించాయని వివరించారు&period; కార్మికులను బయటకు తీసుకురాగానే వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు టన్నెల్ బయట 41 అంబులెన్స్ లను అధికారులు సిద్దం చేసి పెట్టారు&period; టన్నెల్ కు సమీపంలో 41 పడకలతో తాత్కాలికంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు&period; అవసరమైతే హుటాహుటిన తరలించేందుకు హెలికాఫ్టర్ ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు&period; డ్రిల్లింగ్ పని పూర్తికాగానే స్టీల్ పైపును అమర్చి&comma; లోపలికి వెళ్లేందుకు 15 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా టన్నెల్ లో సిద్ధంగా ఉంది&period; కార్మికులను ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై ఈ బృందం ఇప్పటికే పలుమార్లు మాక్ డ్రిల్ నిర్వహించి సిద్దమైంది&period; ఉత్తరకాశీలోని ఈ టన్నెల్ ముందువైపు కుప్పకూలడంతో ఈ నెల 12 నుంచి 41 మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు&period; వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారవర్గాలు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేశాయి&period; లోపల ఉన్న వారికి పైపుల ద్వారా ఆక్సిజన్&comma; ఆహార పదార్థాలు&comma; దుస్తులు సహా అవసరమైన వాటిని పంపించారు&period; డ్రిల్లింగ్ కోసం భారీ మెషినరీ తెప్పించి విశ్రాంతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ లో మునిగిపోయారు&period; అధికారులు&comma; రెస్క్యూ టీమ్ కృషి ఫలించి మరికాసేపట్లో కార్మికులంతా క్షేమంగా బయటపడనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.