90
ఇసుక సరఫరా పై ప్రభుత్వ ఆంక్షలు ఎత్తివేసి సరఫరాను పునరుద్దించాలని సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటి పార్టీ నేతలు మద్దతు పలికారు. ప్రభుత్వం ఇసుక సరఫరా పై ఆంక్షలు విధించడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణాల పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఇసుకను ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకుంటుందని ఆరోపించారు. 20వేల రూపాయలు ఉండే లారీ ఇసుక ధర 30 వేల రూపాయలు చేశారని, సిమెంటు ఐరన్ రేట్లు కూడా పెంచడంతో భవనిర్మానాలు లేక కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also….
Read Also….