ఏమీ చేయనోడే ఎగిరెగిరి పడుతుంటే అన్నీ చేసిన నేనేందుకు చెప్పుకోకూడదు అంటూ మాజీ మంత్రి అమరనాథ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. పలమనేరు కొత్తపేట సచివాలయ పరిధిలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎందుకు చేయలేదో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలన్నారు. ఈ నిధులంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో డబ్బులు కట్టించుకుని పేద ప్రజలను మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానిదైతే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. సంక్షేమ పాలన కావాలంటే మరోసారి తనకు ఓటువేసి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్..
94