ఏమీ చేయనోడే ఎగిరెగిరి పడుతుంటే అన్నీ చేసిన నేనేందుకు చెప్పుకోకూడదు అంటూ మాజీ మంత్రి అమరనాథ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. పలమనేరు కొత్తపేట సచివాలయ పరిధిలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నమ్మకండని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎందుకు చేయలేదో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రశ్నించాలన్నారు. ఈ నిధులంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో డబ్బులు కట్టించుకుని పేద ప్రజలను మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానిదైతే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. సంక్షేమ పాలన కావాలంటే మరోసారి తనకు ఓటువేసి గెలిపించాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
Y AP Needs Jagan
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి ,ఏపీ లో తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చేస్తారన్నారు . అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు అంబటి.
బాపట్ల పట్టణంలోని బేతనీ కాలనీ ఒకటవ వార్డు బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో కర్లపాలెం మండలం m.v. రాజుపాలెంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమమును ఈ నెల 9వ తారీకు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి ఈరోజు మేము మీ వార్డులోకి గ్రామాల్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల్లో 98% పూర్తి చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను నెరవేర్చడంలో వెనుకాడబోరని రానున్న ఆరు నెలల కాలంలో మిగిలిన హామీలను నెరవేర్చే విధంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కోన రఘుపతి అన్నారు.
Read Also..





Total views : 140991