అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైసీపీ నాయకుల విభేదాలు రోడ్డు కెక్కాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చిన వ్యవహారం. ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డిపై చెప్పులతో దాడి చేసిన సంఘటన రాయదుర్గం పట్టణంలో కనేకల్ రోడ్డు లోని రుచిస్ హోటల్ ముందర చోటుచేసుకుంది. కనేకల్ రోడ్డులోని రుచిస్ హోటల్ వద్ద ఉన్న బోర్వెల్ నాగిరెడ్డి పై రామచంద్రారెడ్డి వదిన మంజుల ఒక్కసారిగా చెప్పుతో దాడి చేసింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అయిన హంపారెడ్డి పై బోర్వెల్ నాగిరెడ్డి వాట్సాప్ లో వ్యక్తిగత దూషణలు చేసాడు. వైసీపీ నాయకుడు మెట్టు గోవిందరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారంటూ హంపారెడ్డి పై బోర్వెల్ నాగిరెడ్డి వ్యక్తిగత దూషణ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డి పై హంపారెడ్డి భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాయదుర్గంలో రోడ్డెక్కిన వైసిపి విభేదాలు
71
previous post