63
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడే నాటకాలకు యువత బలి అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ మాయమాటలు నమ్మి రాష్ట్రంలోని యువత మోసపోయిందన్నారు. ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇచ్చారా? ఏటా 2 లక్షలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు.. ప్రకటించారా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక.. ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. జగన్ పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటనా రాలేదన్నారు. ఉద్యోగాలు రాలేదని యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేశ్ కోరారు.