65
ఈ మధ్య కాలంలో జాతీయ రహదారులపై బైక్ రైసింగ్, స్టంట్ చేయడం నేటి యువతకు ఫ్యాషన్ అయిపోయింది. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన ఎక్కువ మంది యువకులు వచ్చారు. వీరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్, బైక్ స్టంట్ విన్యాసాలు చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ బైక్ రైసింగ్ లు చూసేందుకు ప్రజలు బారులు తీరారు. ఇలాంటి విన్యాసాల పట్ల యువత చెడుదారి పడుతోందని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.