నేడు ఢిల్లీలో దీక్షకు దిగుతున్న వైఎస్‌ షర్మిల

YS Sharmila

Advertisements

&NewLine;<p>ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు&period; మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారును నింపింది&period; ఏపీకి ప్రత్యేక హోదా&comma; విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు&period; తాజాగా ఆమె తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు&period; ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు&period; ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఆమె దీక్షకు దిగనున్నారు&period; ఈ దీక్ష ద్వారా ఆమె ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు&period; ఎన్సీపీ అధినేత&comma; రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ను షర్మిల కలిశారు&period; ప్రత్యేక హోదా&comma; విభజన హామీలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతును ఇవ్వాలని పవార్ ను కోరారు&period; పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు&period; షర్మిల విన్నపం పట్ల పవార్ సానుకూలంగా స్పందిస్తూ పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడతామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.