ముగిసిన యువగళం పాదయాత్ర….

Yuvagalam padayatra

Advertisements

&NewLine;<p>టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది&period; జనవరి 27à°µ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు సాగింది&period; విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది&period; రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యాత్ర సాగించాలని ముందుగా టిడిపి భావించింది&period; ఈ ప్రకారం వచ్చే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో ముగించాల్సి ఉంది&period; అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సెప్టెంబర్‌ 9à°µ తేదితో యాత్ర నిలిచిన విషయం తెలిసిందే&period; చంద్రబాబు బెయిల్‌పై వచ్చిన తరువాత నవంబర్‌ 27 నుంచి తిరిగి ప్రారంభించారు&period; సుమారు 80 రోజుల పాటు యాత్ర సాగలేదు&period; మరోపక్క ఎన్నికల సమయం దగ్గర పడటంతో యాత్రను వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు&period; దీంతో విజయనగరం&comma; శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవేశించకుండానే యాత్ర ముగియనుంది&period; ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకను అవుతానని లోకేష్‌ యాత్ర ప్రారంభానికి ముందు తెలిపారు&period; ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అధికార పార్టీ నేతలపై విమర్శల దాడి చేశారు&period; అదేవిధంగా యాత్రలో పలు సమస్యలపై అధికార యంత్రాంగానికి 600పైగా లేఖలు రాశారు&period; పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడి ఉన్న సమస్యను అధికారంలోకి రాగనే పూర్తిచేస్తానని శిలఫలాకలతో లోకేష్‌ హామీ ఇచ్చారు&period; 70 బహిరంగ సభలు&comma; 155 ముఖాముఖి సమావేశాలు&comma; 12 ప్రత్యేక కార్యక్రమాలు&comma; 8 రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్‌ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు&period; భారీ స్థాయిలో ముగింపు సభ&comma; యువగళం విజయోత్సవ సభను టిడిపి భారీస్థాయిలో నిర్వహించనుంది&period; విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20à°µ తేది విజయోత్సవ సభను జరపనుంది&period; రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు&comma; కార్యకర్తలు వస్తారని అంచనా వేసింది&period; చిత్తూరు&comma; తిరుపతి&comma; రైల్వే కోడూరు&comma; అనంతపూర్‌&comma; ఆదోని&comma; నెల్లూరు&comma; మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను టిడిపి సిద్ధం చేసింది&period; ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..