అందాలకు… సిరి

Amla

Advertisements

&NewLine;<p>ఉసిరి&period;&period; విటమిన్‌ &&num;8216&semi;సి&&num;8217&semi; నిండుగా అందించే పోషకంగా మనందరికీ తెలుసు&period; ఆహారంగానే కాదు చర్మం&comma; జుట్టు అందానికీ ఇదెంతో ఉపయోగపడుతుంది&period; ఇలా ప్రయత్నించండి&period;&period; ముఖంపై ముడతలతో చాలామంది తమ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తారు&period; ఇలాంటివాళ్లు టేబుల్‌ స్పూన్‌ ఉసిరి పొడిలో చెంచా పెరుగు&comma; కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి&period; కనీసం రెండు మూడురోజులకోసారి చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి&period; రోజంతా ఎండ&comma; దుమ్ము ధూళి కారణంగా చర్మంపై నలుపుదనం పెరుగుతుంది&period; గరుకుగా తయారవుతుంది&period; ఉసిరి రసం ముఖానికి రాసి పదినిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి&period; మీది మరీ సున్నిత చర్మతత్వం అయితే కొంచెం తేనె కలిపి రాసుకున్నా సరిపోతుంది&period; ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని శుభ్రపరుస్తాయి&period; మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి&comma; చెంచా నిమ్మరసం&comma; కాసిని పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి&period; ఇలా రోజుకోసారి చేస్తుంటే మొటిమల సమస్య దూరమవుతుంది&period; కాలుష్యం&comma; కఠిన రసాయనాల వాడకం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి&period; ఉసిరిలో ఉండే విటమిన్‌ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్ల వృద్ధికి తోడ్పడతాయి&period; మాడు పొడిబారడం&comma; చుండ్రు సమస్యలున్నాయా&quest; ఉసిరిపొడి మజ్జిగలో నానబెట్టి దానికి కోడి గుడ్డు తెల్లసొన&comma; చెంచా బాదం నూనె జత చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి&period; అరగంటాగి మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే సరి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు