128
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలుఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పోలీసు సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులు అర్పించారు. అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అమరులను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ 1993 నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు.