పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్తిపాడు,ఏలేశ్వరం,అన్నవరం, రౌతులపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది మరియు యువకులు సుమారు 80 మంది రక్తదానం చేసారు.. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ వారిచే ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు యువత కూడా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోవాలని యువతకు ఈ సందర్భంగా సూచించారు.
police Martyrs
పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఏ.ఆర్.గ్రౌండ్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా పోలీస్, అగ్నిమాపక మరియు NDRF కి సంబంధించిన పరికరాలను ప్రదర్శించారు. ప్రదర్శన లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ జాగిలాలు, రైఫిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాలోన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని విజయవాడ సిటీ కమిషనర్ కాంతి రానా తెలిపారు.
అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది. అమరుల త్యాగాలు, ఆశయాలను స్పూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదాం అని అనంతపురం రేంజ్ .ఐ.జి RN అమ్మిరెడ్డి , జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసులకు సంయుక్తంగా పిలుపునిచ్చారు. జిల్లా ప్రశాంతత, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వర్తించాలని వారు కోరారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలుఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పోలీసు సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల స్తూపానికి జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులు అర్పించారు. అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అమరులను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ 1993 నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు.





Total views : 75192