ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్&comma; కర్నాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి&period; శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో సీఎంలు చంద్రబాబు&comma; సిద్దరామయ్య ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు&period; ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది&period;&period;ఇదే స్ఫూర్తితో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాయి&period; 13-16 ఏళ్లలోపు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు అసెంబ్లీలో వెల్లడించారు&period;టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని&comma; బానిసైతే జీవితాలు నాశనమవుతాయని చంద్రబాబు హితవు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>పిల్లలు సోషల్‌ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు&period; 13 -16 ఏళ్ల లోపు వారికి సంబంధించి సోషల్‌మీడియా బ్యాన్‌ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందన్న ఆయన&period; ఆ వయసు లోపు వారికి సోషల్‌ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు&period;13-16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు&period; సోషల్‌మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదన్న చంద్రబాబు&period;&period; సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period; spot<&sol;p>&NewLine;<p>మొబైల్‌ వాడకం వల్ల పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల భావాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు&period; ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిందని ఆయన గుర్తుచేస్తూ&period;&period; భారత్‌లో ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందన్నారు&period; ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వినియోగంపై స్పందించిందన్నారు&period; కాగా&period; పిల్లల్లో సోషల్‌ మీడియా వినియోగాన్ని నియంత్రించాలనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది&period; సీఎం ఇటీవల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు&period; పిల్లలకు సోషల్‌ మీడియా బ్యాన్‌కు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు కోరారు&period; ఈ క్రమంలోనే తాజాగా కర్నాటక సీఎం సిద్దరామయ్యా ప్రకటన చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.