92
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత ఉపన్యాసమిచ్చారు. సీఎం కేసీఆర్ అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం సీఎం కెసిఆర్ కి రెండు కళ్ళ లాంటివని కొనియాడారు. ఆనాటి బీడు భూముల తెలంగాణ.. నేడు పచ్చని పొలాలతో.. సిరి సంపదలతో సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందంటే.. దానికి కారణం కేసిఆర్ దూరదృష్టినే కారణమన్నారు. ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని.. ఖచ్చితంగా మళ్లీ కెసిఆరే సీఎం అవుతారని తన ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో మూడో సారి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.