ఇరాన్‌తో యుద్ధంలో ఒంటరైపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌.

Advertisements

<p>ఇరాన్‌పై యుద్ధం ప్రకటించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పెద్ద తప్పు చేశారా&period;&period;&quest; అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అమెరికా ఒంటరైందా&period;&period;&quest; వీలైనంత త్వరగా యుద్ధం ఆపాల్సిన పరిస్థితికి ట్రంప్‌ చేరుకుంటున్నారా&period;&period;&quest; మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే&period;&period; ఇదే ఖాయమనిపిస్తోంది&period; తనకు ఎదురు ఎవరూ లేరు అన్న రీతిలో విర్రవీగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి&period; ఇరాన్‌ మీద ఇజ్రాయిల్‌తో యుద్ధం మొదలుపెట్టించిన ఆయన&&num;8230&semi; ఆ తర్వాత స్వయంగా దాడులకు దిగారు&period; మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నా రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి&period; ఓ వైపు ఆయుధ సంపత్తి తరిగిపోతుండడం&&num;8230&semi; ఖరీదైన క్షిపణుల వినియోగం కారణంగా వేల కోట్లు కరిగిపోతుండడం&period;&period; ట్రంప్‌తో పాటు అమెరికా సమాజాన్ని మొత్తం కలవరపెడుతోంది&period; యుద్ధం ఇలాగే మరికొద్ది రోజులు కొనసాగితే&&num;8230&semi; అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం లేకపోలేదని ఆ దేశ ఆర్థిక నిపుణులే చెబుతున్నారంటే&period;&period; పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు&period; ఓ వైపు స్వదేశంలో సిచ్యుయేషన్‌ ఇలా ఉంటే&period;&period; ట్రంప్ మాత్రం యుద్ధోన్మాదాన్ని వీడడం లేదు&period; ఇరాన్‌ను పూర్తి స్థాయిలో నాశనం చేస్తే తప్ప తనకు నిద్ర పట్టదు అన్న స్థాయిలో ప్రవర్తిస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>అయితే డొనాల్డ్ ట్రంప్‌ వ్యూహాలకు ఇరాన్‌ ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతోంది&period; ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి మూసేసి&&num;8230&semi; యావత్‌ ప్రపంచం చమురు రంగం గొంతు నొక్కేసింది ఇరాన్‌&period; దీంతో దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి&period; ఇంకొద్ది రోజులు సంక్షోభం ఇలాగే కొనసాగితే&&num;8230&semi; చాలా దేశాలు ఆర్థికంగా దివాళా తీసే ప్రమాదం నెలకొంది&period; ఇదే సమయంలో ట్రంప్‌ బెట్టు వీడకుండా ఇరాన్‌ను దారికి తెచ్చేందుకు ప్రపంచ దేశాలు తనతో కలసి రావాలంటూ పిలుపునిచ్చారు&period; హర్మూజ్‌ జలసంధి తెరిపించడానికి అన్ని దేశాలు సహకారం అందించాలంటూ ఆయన చేసిన ప్రకటనపై ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించలేదు&period; ఈ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నాటో స్పష్టం చేస్తే&period;&period; భారత్‌&comma; జపాన్‌&comma; బ్రిటన్‌ సహా అనేక దేశాలు తమది తటస్థ వైఖరి అని తేల్చేశాయి&period; ఇక చైనా అయితే ఏకంగా ముందుగా అమెరికా సైనిక చర్యలను ఆపేయాలంటూ తెగేసి చెప్పింది&period; ఇంతకాలం అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన దేశాలు సైతం&&num;8230&semi; ఈ వ్యవహారంలో అంటీ ముట్టకుండా ఉంటున్నాయి&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడంతో ట్రంప్‌పై ఒత్తిడి రోజురోజుకూ పెరిగిపోతోంది&period; మరోవైపు ఈ విషయంలో చర్చలకు ఎలాంటి తావు లేదని&&num;8230&semi; ఎందాకైనా పోరాటానికి సిద్ధమని ఇరాన్‌ కుండబద్దలు కొట్టేసింది&period; ఈ నేపథ్యంలో తగ్గాల్సింది ఎవరైనా ఉన్నారంటే&&num;8230&semi; అది అమెరికా&comma; ఇజ్రాయిలే అన్నది తేలిపోతోంది&period; మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ట్రంప్‌ వెనక్కి తగ్గుతారా&&num;8230&semi; లేక తన మొండితనం తనదే అంటూ&period;&period; అమెరికా భవితవ్యాన్ని ఫణంగా పెట్టి యుద్ధాన్ని కొనసాగిస్తారా&&num;8230&semi; వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.