తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో చివరివరకు పొత్తుకు ప్రయత్నించి విఫలమైన సీపీఎం తాజాగా తమ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు. తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సీపీఎం 14 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. భద్రాచలం అభ్యర్ధిగా కారం పుల్లయ్య, అశ్వారావుపేట అభ్యర్ధిగా పిట్టల అర్జున్, పాలేరు అభ్యర్ధిగా తమ్మినేని వీరభద్రం, మధిర అభ్యర్ధిగా పాలడుగు భాస్కర్, వైరా అభ్యర్ధిగా భూక్యా వీరభద్రం, ఖమ్మం అభ్యర్ధిగా ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లి అభ్యర్ధిగా మాచర్ల భారతి, మిర్యాలగూడ అభ్యర్ధిగా జూలకంటి రంగారెడ్డి… ఇక నకిరేకల్ నియోజకవర్గానికి చినవెంకులు, భువనగిరి నియోజకవర్గానికి కొండమడుగు నర్సింహను, జనగామకు మోకు కనకారెడ్డిని, ఇబ్రహీంపట్నంకు పగడాల యాదయ్య, పటాన్చెరు నియోజకవర్గానికి జే. మల్లికార్జున్ ను, ముషీరాబాద్ నియోజకవర్గానికి ఎం.దశరథ్ ను ఖరారు చేశారు.
128
previous post