ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్ వివరించారు. ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదు, బంగారం ప్రభావాన్ని తగ్గించేందుకు సర్వేలేన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, ఒక్కో నియోజకవర్గానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీస్ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మొత్తం రూ. 46.81 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. నగరంలో ఇతర జిల్లాల నుంచి అక్రమ రవాణాను నిరోధించేందుకు 18 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, కలెక్టర్, డిప్యూటీ డీఈఓ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ కమిషనర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ‘నిఘా’ బృందాలు
97
previous post