మధుయాష్కీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఉద్యమ కారులు , వికలాంగులు,విద్యార్థి యువకులు. హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విద్యార్థి యువకులు, వికలాంగులు, ఉద్యమ కారులు భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు, ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం లో ముందు నడిచిన రాష్ట్ర సాధన కు కృషి చేసిన మధు యాష్కీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం గా ఉందని, మధు యాష్కీ గెలుపుకు తమ వంతు సహకారం అందిస్తామని యువకులు ఉద్యమకారులు తెలిపారు. విద్యార్థి,ఉద్యమ అమరుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణ లో ఉద్యమ కారులకు, విద్యార్థులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని తెలిపారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎల్బీనగర్ ప్రజలు మధు యాష్కీ ని గెలిపించుకోవలని కోరారు.
ఎల్బీనగర్ బీఆర్ఎస్ కు భారీ షాక్
143