125
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ఎస్బిఐ బజార్ బ్రాంచ్ లో దోపిడీ ఘటనపై జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీకి పాల్పడిన నిందితుడు రుస్తుంబాద గ్రామానికి చెందిన తానేటి సురేష్ బాబును అరెస్టు చేసి కోర్టులోహాజరు పరిచినట్లు ఆయన మీడియాకు తెలిపారు. నిందితుడు కత్తితో బెదిరించి దోచుకున్న 6. 50 లక్షలు సొత్తును రికవరీ చేసి దొంగతనానికి నిందితుడు ఉపయోగించిన కత్తి బ్యాగ్, క్యాప్ ,మాస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పోలీస్ సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి నిందుతుడిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.సిబ్బంది సీఐ శ్రీనివాస్ యాదవ్ ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది వేణు వాసు లను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.