ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు…

Advertisements

<p>జాబ్‌ క్యాలెండర్‌ కింద త్వరలోనే డీఎస్సీ ప్రకటించనున్నట్లు విద్య&comma; ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు&period; వెనకబడిన ప్రాంతమైన కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విద్యా&comma; ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు&period; సమగ్ర శిక్షా అభియాన్‌ పై అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు&period; సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేసే ఉద్యోగులకు&period;&period; ఏపీ&comma; తెలంగాణ&comma; కేరళ&comma; తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే జీతాలు ఎక్కువగా ఉన్నాయన్నారు&period; గతంలో మూడు నెలలకోసారి జీతాలిచ్చేవారని&comma; ఇప్పుడు ఒకటో తేదీనే ఇస్తున్నామని మంత్రి తెలిపారు&period; జీతాల పెంపు అంశాన్ని వచ్చే సమావేశంలో కేంద్రంతో చర్చిస్తామని వివరించారు&period; కర్నూలు ప్రాంతంలో అవసరమైన మేరకు సీజనల్‌ వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు&period; యువగళం సందర్భంగా ఆదోని&comma; ఆలూరు&comma; మంత్రాలయం ఎంత వెనకబడి ఉన్నాయో ప్రత్యక్షంగా చూశానని అన్నారు&period; కర్నూలు ప్రాంతానికి వచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు&period; డీఎస్సీలోనూ కర్నూలు జిల్లాకు ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేశామని&comma; అయినా ఉపాధ్యాయ&period;&period; విద్యార్థుల నిష్పత్తి తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు&period; కర్నూలులో క్లస్టర్‌ విశ్వవిద్యాలయానికి 139 కోట్లు మంజూరయ్యాయని&period;&period; అందులో రూసా కింద 55 కోట్లు ఖర్చయ్యాయని మంత్రి నారా లోకేశ్‌ వివరించారు&period; ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు&period; క్లస్టర్‌ విశ్వవిద్యాలయ ఏర్పాటులో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేయడానికి74&period;5 కోట్లు అవసరమని&comma; వచ్చే విద్యా సంవత్సరంలో వాటిని మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.